Gautam Gambhir Retirement : Is He Contest in Next General Elections ? | Oneindia Telugu

2018-12-06 229

After more than 15 years of cricket for my country, I want to retire from playing this beautiful game," said Gambhir. Reports have claimed that Gambhir is set to contest in the next general elections from Delhi on a Bharatiya Janata Party (BJP) ticket
#GautamGambhir
#CricketFormats
#GautamGambhirRetirement
#indiancricketteam
#KolkataKnightRiders
#ipl

దశాబ్దంన్నర పాటు అభిమానులను అలరించిన టీమిండియా వెటనర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా విమర్శకుల మాటకు తలొగ్గుతూ క్రికెట్ ఆడుతోన్న గంభీర్ మంగళవారం అనూహ్యంగా తన వీడ్కోలు నిర్ణయాన్ని వెల్లడించాడు. దాదాపు 11నిమిషాల నిడివి కలిగిన వీడియో సందేశాన్ని సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌చేస్తూ 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. గురువారం నుంచి ఫిరోజ్‌షా కోట్లా వేదికగా ఆంధ్రతో మొదలయ్యే రంజీ మ్యాచ్ తనకు చివరిదని అందులో పేర్కొన్నాడు. 2003లో ఢాకాలో బంగ్లాదేశ్‌పై టీమ్‌ఇండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన గంభీర్ జాతీయ జట్టుకు ఎనలేని సేవలు అందించాడు.