England vs Pak: Jos Buttler & Dom Bess Star As England Level Series

2018-06-04 80

Jos Buttler displayed his full range of strokeplay in a sparkling 80 not out to take England to 363 - a 189-run lead.
And after Pak were reduced to 42-3, it never seemed likely that the game would reach day four at Headingley.
#pak
#england
#cricket
#josbuttler

పాకిస్తాన్‌తో తొలి టెస్టులో ఎదురైన పరాజయానికి ఇంగ్లండ్‌ బదులు తీర్చుకుంది. రెండో టెస్టులో కేవలం మూడు రోజుల్లోనే విజయాన్ని సొంతం చేసుకొని సిరీస్‌ను 1-1తో ముగించింది. రెండో టెస్టులో పాక్‌ మూడు రోజుల్లో.. ఇన్నింగ్స్‌ 55 పరుగుల తేడాతో చిత్తయింది. ఓవర్‌నైట్‌ స్కోరు 302/7తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌.. 363 పరుగులకు ఆలౌటైంది.
ఆతిథ్య జట్టు పేసర్లు బ్రాడ్‌ (3/28), బెస్‌ (3/33) ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ 134 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బట్లర్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'... అబ్బాస్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డులు దక్కాయి.