Koratala Shiva Gives Explination About Sri Reddy Issue

2018-04-17 1

Koratla shiva on behalf of sri reddy issue..gives clarification about his role in issue .

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భరత్ అనే నేను' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మరో వైపు.... టాలీవుడ్లో సంచలనంగా మారిన కాస్టింగ్ కౌచ్ ఇష్యూలో కొరటాల శివ పేరు రావడం, శ్రీరెడ్డి అతడిపై ఆరోపణలు చేసిందంటూ సోషల్ మీడియాలో వాట్సాప్ చాట్ సర్క్యులేట్ అవ్వడంతో అంతా షాకయ్యారు. చూడటానికి సుద్దపూసలా కనిపించే కొరటాల శివ ఇలాంటోడా? అనే అనుమానాలు తెలుగు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. ఇంత కాలం 'భరత్ అనే నేను' సినిమాకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండటంతో స్పందించలేక పోయిన కొరటాల..... తాజాగా ఈ వివాదంపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
భరత్ అనే నేను మూవీ పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఏప్రిల్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. గత రెండు వారాల నుండి నేను, మా టీం రోజూ 18 నుండి 20 గంటలు పని చేస్తూ ఫైనల్ కాపీ రెడీ చేశాం. ఫైనల్ ఔట్ పుట్ చూసి ఎంటైర్ టీం చాలా ఆనందంగా ఉంది. సినిమా ప్రమోషన్లు మొదలు పెట్టేముందు ఒక చిన్న ఇష్యూ గురించి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలనిపించింది. లాస్ట్ వీక్ నా గురించి ఏవో స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో సర్య్కులేట్ అవుతున్నాయి. ఇన్ని రోజులు ఫుల్ బిజీగా ఉండి వాటిపై స్పందించలేక పోయాను.... అని కొరటాల తన వివరణ మొదలు పెట్టారు.