"Koratala Siva no1 worst character in this world..if I allow a bio pic of mine, he wl hv a major part in that film." Sri Reddy said.
#SriReddy
#KoratalaSiva
#pawankalyan
#lawrence
#vishal
#ranadaggubati
#nani
#tollywood
మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివ. రచయితగా ఇండస్ట్రీలో కెరీర్ మొదలు పెట్టిన శివ దర్శకత్వం వైపు అడుగులు వేసి టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఎదిగారు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే కొరటాల ... వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న శ్రీరెడ్డికి టార్గెట్ కావడం చర్చనీయాంశం అయింది. గతంలోనూ కొరటాలను టార్గెట్ చేస్తూ కామెంట్ చేసిన శ్రీరెడ్డి తాజాగా అతడి పేరును ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రపంచంలో నెం.1 వరస్ట్ క్యారెక్టర్ కొరటాల శివ అంటూ శ్రీరెడ్డి మండి పడ్డారు. ఆమె ఇంతలా ఫైర్ కావడానికి కారణం ఏమిటి? ఇద్దరి మధ్య ఉన్న గొడవ ఏమిటి? అనేది హాట్ టాపిక్ అయింది.
నా బయోపిక్ తీయడానికి నేను అనుమతి ఇస్తే.. అందులో మేజర్ పార్ట్ కొరటాల శివకు సంబంధించినదే ఉంటుందని శ్రీరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మరి శ్రీరెడ్డి వ్యాఖ్యలపై కొరటాల శివ ఎలా స్పందిస్తారో చూడాలి. నా బయోపిక్ తీయడానికి నేను అనుమతి ఇస్తే.. అందులో మేజర్ పార్ట్ కొరటాల శివకు సంబంధించినదే ఉంటుందని శ్రీరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మరి శ్రీరెడ్డి వ్యాఖ్యలపై కొరటాల శివ ఎలా స్పందిస్తారో చూడాలి.
అయితే శ్రీరెడ్డి చేసిన ఈ కామెంటుపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. దేశం మొత్తం ఒక లొల్లి ఉంటే.. నీదో లొల్లా? అంటూ మండి పడుతున్నారు. కొందరైతే శ్రీరెడ్డి పేజీని హ్యాక్ చేయాలని కోరడం గమనార్హం.
కారణం ఏమిటో చెప్పకుండా కేవలం కొరటాల శివపై ఆరోపణలు చేయడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. శ్రీరెడ్డి పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తోందని ఆరోపించేవారు కూడా లేకపోలేదు. కొంతకాలంగా సైలెంటుటగా ఉన్న శ్రీరెడ్డి మళ్లీ వివాదాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.