Gautam Gambhir's Befitting Reply To Shahid Afridi, Fans Fight On Twitter

2018-04-04 139

Gautam Gambhir Loses His Cool on Shahid Afridi Tweet. Gautam Gambhir, who shares a cold relationship with Afridi, reacted strongly to the comment. He slammed the Pakistani cricketer's tweet and wrote that Afridi was "celebrating a dismissal off a no- ball!!!" Gambhir wrote, "Media called me for reaction on.

గౌతమ్ గంభీర్.. మిగతా క్రికెటర్లతో పోలిస్తే కాస్త దేశభక్తి ఎక్కువ. సరిహద్దుల్లో ఎన్నోసార్లు పాక్ దుశ్చర్యలపై అతడు స్పందించాడు. తాజాగా పాక్ క్రికెటర్ అఫ్రిది కశ్మీర్ అంశంపై చేసిన సంచలన వ్యాఖ్యలపై గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు
అఫ్రిది వ్యాఖ్యలను అంతగా పట్టించుకోనక్కరలేదని, అతను నోబాల్‌తో వికెట్‌ తీసి సంబరాలు చేసుకుంటున్నాడని గంభీర్ గట్టిగా పంచ్ ఇచ్చాడు. 'అఫ్రిది ట్వీట్‌పై నన్ను స్పందించాల్సిందిగా మీడియా అడిగింది. దీనిపై ఏం స్పందించాలి? బుద్ధిమాంద్యం ఉన్న అతని దృష్టిలో యూఎన్ అంటే అండర్ 19 అని అర్థం. మీడియా దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అఫ్రిది నోబాల్‌తో వికెట్‌ తీసి ఆనందపడుతున్నాడు.' అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు.
అఫ్రిదికి గంభీర్‌ మధ్య మాటల యుద్దం తొలిసారేం కాదు. గతంలో ఎన్నో సార్లు వీరి మధ్య మాటల యుద్దం నడించింది. 2011 వరల్డ్ కప్ విజయానంతరం గంభీర్‌ తన విజయాన్ని ముంబై దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారకి అంకితం చేశాడు. ఈ వ్యాఖ్యలను అఫ్రిది తప్పుబట్టగా.. గంభీర్‌ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు.
అఫ్రిది వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అఫ్రిది పాకిస్థాన్ తరఫున 27 టెస్టులు, 398 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. 2011 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొన్న పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.