TTD Deposits Huge Amount Of Money In Banks Illegally

2018-04-02 4

The TTD officials have made bank deposits against the rules creating sensation. Some banks have complained to the government about the issue, then this issue came to light.The TTD officials have made deposits of Rs 4 thousand crores in various banks against the regulations.

తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి)లో నిబంధనలకు విరుద్దంగా మనీ డిపాజిట్ల ఉదంతం కలకలం రేపుతోంది. టిటిడి రూల్స్ ను తోసిరాజని ఇలా ఇప్పటివరకు రూ.4 వేల కోట్ల రూపాయలను టిటిడి ఆర్థిక శాఖ అధికారులు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసినట్లు సమాచారం.టిటిడి నిబంధనల ప్రకారం సీల్డ్‌ కవర్‌ టెండర్లను ఆహ్వానించి ఈ డిపాజిట్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా...అదేమీ చేయకుండా కేవలం ఫోన్లలో సంప్రదింపులు ద్వారా ఈ వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది. తమ బ్యాంకులో డిపాజిట్ చేస్తే 7.33% వడ్డీ ఇస్తామన్న విజయబ్యాంక్‌ను కాదని 7.32% వడ్డీకి ఆంధ్రా బ్యాంకులో రూ.3 వేల కోట్లు డిపాజిట్‌ చేసినట్లు తెలుస్తోంది.
అలాగే 7.66% వడ్డీకి ఇండస్‌ బ్యాంకులో రూ.వెయ్యి కోట్లు డిపాజిట్‌ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై కొన్నిబ్యాంకులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో విషయం బైటకు పొక్కి ఇంటలిజెన్స్ విచారణ జరుగుతున్నట్లు సమాచారం.