Ball Tampering : Warner & Smith banned for 1 year, Bancroft suspended for 9 months

2018-03-28 662

Smith and David Warner, formerly captain and vice-captain of Australia, have been banned for 12 months by Cricket Australia for their roles in the pre-meditated plan to tamper with the ball.

బాల్ టాంపరింగ్‌కు పాల్పడి దేశం పరువు తీసిన ఆస్ట్రేలియా క్రికెటర్లపై ఆ దేశ బోర్డు నిషేధం విధించింది. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఆస్ట్రేలియాకు రెండేళ్ల పాటు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా కూడా క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. ఇక, మూడో టెస్టులో బాల్ టాంపరింగ్ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన కామరూన్ బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది.బాల్ టాంపరింగ్ వివాదాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తేలిగ్గా తీసుకున్నప్పటికీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంది.