India vs South Africa: AB de Villiers is back

2018-02-09 1

De Villiers had to sit out of the first three ODIs to recover from a finger injury and in his absence, India's wrist spinners tormented the Proteas while Kohli bullied their bowling, scoring hundreds in their traditional strongholds.

ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్‌తో జరిగే చివరి మూడు వన్డేలకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేరుని 15 మంది జట్టు సభ్యుల్లో చేర్చింది. వరుసగా తొలి మూడు వన్డేల్లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా క్రికెట్ అభిమానులకు ఇది ఊరటనిచ్చే వార్త.
ఈ సిరిస్‌లో జోహెన్స్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో శనివారం (ఫిబ్రవరి 10)న జరిగే నాలుగో వన్డేలో ఏబీ డివిలియర్స్ తిరిగి జట్టులోకి అడుగుపెట్టనున్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన మూడో టెస్టులో కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో చేతి వేలు గాయం కారణంగా తొలి మూడు వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత రెండో వన్డేలో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్, డికాక్ కూడా దూరం కావడంతో సఫారీ జట్టు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఆరు వన్డేల సిరిస్‌ను కాపాడుకోవాలంటే మిగతా మూడు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో డివిలియర్స్ తిరిగి జట్టులోకి అడుగు పెడుతుండటం ఆ జట్టులో నూతన ఉత్సాహాన్ని నింపింది.
ఏబీ డివిలియర్స్, డుప్లెసిస్ గైర్హాజరీలో భారత మణికట్టు స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లను ఎదుర్కోవడంలో సపారీ బ్యాట్స్‌మెన్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి వీరిద్దరూ 21 వికెట్లు తీసి సఫారీలను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచని స్థితిలో సఫారీ బ్యాట్స్‌మెన్ ఉన్నారు.
ఇలాంటి సమయంలో డవిలియర్స్ తిరిగి జట్టులోకి రావడం జట్టులో ఆత్మవిశ్వాసం నింపుతుందని డుమిని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. 'నాలుగో వన్డేలో ఏబీ డివిలియర్స్ జట్టులోకి రావడం మా అందరికీ కొంతమేరకు ఉత్సాహాన్నిస్తుంది. వన్డే క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో డివిలియర్స్ ఒకడు. గాయం కారణంగా భారత్‌తో తొలి మూడు వన్డేలకు దూరమయ్యాడు. అతని పునరాగమనంతో జట్టులో ఉత్సాహం రెట్టింపవుతుంది' అని అన్నాడు.

Easy Viral Banner Traffic