అనుష్క-విరాట్ ఆస్తుల విలువ తెలిస్తే షాకే !

2017-12-14 1

Finally, Virat Kohli and Anushka Sharma are married. The moment, pictures and video of the dazzling duo are already viral.

ఇన్నాళ్లు ప్రేమలో మునిగి తేలిన అనుష్క శర్మ, విరాట్ కోహ్లి ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి వేడుక ఇపుడు ఇండియాలో హాట్ టాపిక్. ఈ సెలబ్రిటీ కపుల్‌ను ఇపుడు అంతా 'పవర్ కపుల్' అని పిలుస్తున్నారు. ఈ ఇద్దరికీ కలిపి దాదాపు రూ. 600 కోట్ల ఆస్తులు ఉన్నాయని బ్రాండ్ ఎనలిస్ట్ శైలేంద్ర సింగ్ తెలిపారు.
ఈ జంట ఆస్తుల విలువ వచ్చే రెండేళ్లలో రూ. 1000 కోట్లకు చేరుతుందని ఈజీగా చెప్పగలను అని శైలేంద్ర సింగ్ తెలిపారు.
విరాట్ కోహ్లి-అనుష్క శర్మ వివాహం ఇండియన్ బ్రాండ్ మార్కెట్‌లో బిగ్గెస్ట్ మూమెంట్, ఇద్దరూ ఈక్వెల్ స్ట్రెంత్ మరియు అవకాశాలు కలిగి ఉన్నారు. ఈ జంట ఆస్తుల విలువ వచ్చే రెండేళ్లలో రూ. 1000 కోట్లకు చేరుతుందని ఈజీగా చెప్పగలను అని శైలేంద్ర సింగ్ తెలిపారు.
ఫినాప్ రిపోర్టు ప్రకారం... విరాట్ కోహ్లి రూ. 382 కోట్లు, అనుష్క శర్మ రూ. 220 కోట్ల విలువ చేసే ఆస్తులు కలిగి ఉన్నారు. గడిచిన మూడేళ్లలో అనుష్క ఆదాయం 80శాతం పెరిగింది. ఈ అంచనాల ప్రకారం వచ్చే మూడేళ్లలో ఆమె ఆస్తుల విలువ 30 శాతం, సంవత్సర ఆదాయం 18 శాతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.