Facebook సైట్ లో ఇటీవల ఎన్నో కొత్త options ప్రవేశపెట్టబడ్డాయి. వాటిలో Sidebar Ticker ఒకటి. ఇది మన Friendsలో ఎవరెవరు ఏయే పనులు చేస్తున్నారన్నది రియల్ టైమ్ లో అప్ డేట్లు చూపిస్తుంటుంది. ఇది మంచి సదుపాయమే అయినా, సీరియస్ గా మనం ఇతర పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఈ Sidebar Ticker అనవసరమైన అంశాలపైకి మన దృష్టిని మళ్లించి సమయం వృధా చేసే ప్రమాదమూ ఉంది. అందుకే కొంతమంది దీన్ని పెద్దగా ఇష్టపడడం లేదు. ఒకవేళ మీకూ ఈ Sidebar Ticker నచ్చకపోతుంటే దాన్ని తొలగించుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తున్నాను. 5 నిముషాల్లో మీరు ఆ సైడ్ బార్ ని తీసేసుకోవచ్చు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.