తెలుగు telugu Cyber Crime Fake Mail ID Full HD Nallamothu

2011-08-03 148

సైబర్ నేరాలకు పాల్పడితే ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా చాలామందిలో ఉంటోంది. అలాగే బాధితులు కూడా సరైన help దొరకదేమోనని కామ్ గా ఉండిపోతున్నారు. ఈ నేపధ్యంలో టెక్నాలజీ రంగంలో 15 ఏళ్లుగా ఉండడం వల్ల నాకు తెలిసిన కొన్ని కేసులు, అవి పరిష్కారమైన తీరూ మిత్రులతో పంచుకుంటాను వీలువెంబడి! ఆ క్రమంలో ఇప్పుడో కేసు వివరాలు చెబుతాను.

కేస్:

ఒకతను ఓ మహిళ పేరుతో ఇ-మెయిల్ ఐడి సృష్టించుకుని, ఆ మెయిల్ ఐడితో 5 వెబ్ సైట్లలో "తాను ఓ కాల్ గర్ల్" ననీ, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ సైతం పేర్కొన్నాడు.

ఇన్వెస్టిగేషన్ ఇలా జరిగింది:

అతను ఏయే IPల నుండి మెసేజ్ లు పోస్ట్ చేశాడన్నది ISPల సహకారంతో, ఆయా వెబ్ సైట్ల వెబ్ మాస్టర్ logsలో ఆ వ్యక్తిచే పోస్ట్ చేయబడిన మెసేజ్ ల timestamp, ip అడ్రస్ లు, మెయిల్ సర్వర్లలోని ఆ అకౌంట్ యొక్క ఏక్టివిటీ రికార్డులు పోలీసులు తెలుసుకుని అతని అడ్రస్ పట్టుకుని అరెస్ట్ చేశారు. కాలేజీలో ఆ అమ్మాయి తన క్లాస్ మేట్ అనీ, పెళ్లి చేసుకోమని అడిగితే ఒప్పుకోలేదని ఇలా చేశాననీ పోలీసులతో చెప్పాడు.

పడిన శిక్ష:

IT Act 2000లోని U/S 67 సెక్షన్ ప్రకారం మరియు IPC 469, 509 ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్ష అమలుపరచబడింది.