సినిమా డివిడిల్ని మీ పిసిలోకి కాపీ చేయడానికి ప్రయత్నిస్తున్నా కాపీ అవడం లేదా? మీ దగ్గర DVD 9 సైజ్ లో ఉన్న సినిమాని 4.3 GB స్టోరేజ్ కెపాసిటీ కలిగిన సింగిల్ లేయర్ డివిడిలోకి రైట్ చేసుకోవాలనుకుంటున్నారా? డివిడిలో ఉన్న సినిమాల్లో నచ్చిన సీన్, సాంగ్ వరకే కట్ చేసుకుని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? ఒక డివిడి సినిమాలో సహజంగా వేర్వేరు ఛాప్టర్లు, మెనూలూ ఉంటాయని మనకు తెలిసిందే కదా! సో మెనూలెందుకు దండగ అనుకుంటున్నారా? డివిడిలోని అవసరం లేని భాగాలను తొలగించి తిరిగి ఖాళీ డిస్కులో రైట్ చేసుకునే వీలుంటే ఎంత బాగుణ్ణూ.. అన్నది మీ ఫీలింగా..? అయితే మీ అవసరాలన్నింటికీ ఒక్కటే సరైన తరుణోపాయం.. అదే Aviosoft CloneDVD.