వివిధ ఫంక్షన్లు, పార్టీలూ, టూర్లలో మనం దిగిన ఫొటోలను ఆకర్షణీయమైన picture collageలుగా తయారు చేసుకోవడానికి పికాసా వంటి ఉచిత టూల్స్ ఉన్నప్పటికీ ఈ క్రింది వీడియోలో నేను పరిచయం చేయబోతున్న Picture Collage Maker Pro అనే సాఫ్ట్ వేర్ లో ఎన్నో మెరుగైన సదుపాయాలు లభిస్తున్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ ఈ సాఫ్ట్ వేర్ ని వాడని వారు కూడా చాలా వేగంగా అర్థం చేసుకుని అత్యంత నాణ్యమైనా, ఆకర్షణీయమైనా picture collagesని ఈ Picture Collage Maker Pro అనే ప్రోగ్రామ్ ద్వారా సృష్టించుకోవచ్చు. దీనిని ఎలా వాడాలో ఈ వీడియోలో ప్రతీ స్టెప్ వివరంగా చూపించడం జరిగింది. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.