ప్రతీరోజూ గానీ, వారంలో ఒకరోజు గానీ, లేదా ఈ ఒక్కరోజు అర్జెంట్ గా బయటకు వెళుతూ మీరు సెట్ చేసిన టైమ్ కి ఆటోమేటిక్ గా కంప్యూటర్ ఆపేయబడేలా ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది కదూ..! ఇలా మీరు కోరుకున్న టైమ్ కి పిసి ని షట్ డౌన్, రీస్టార్ట్, హైబర్నేట్, లాగాఫ్ చేసి పెట్టడానికి ఓ మంచి టూల్ ని ఈ క్రింది వీడియోలో కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ చూపిస్తున్నారు. స్పీకర్లు ఆన్ చేసుకుని ఈ వీడియో చూడండి, దీని పవర్ మీకే అర్థమవుతుంది. ఈ టూల్ షట్ డౌన్ సమయంలో పిసిలోని టెంపరరీ ఫైళ్లని క్లీన్ చేయడం వంటివీ చేసిపెడుతుంది.