Facebook అకౌంట్ ఉన్నవారు status updates, ఫొటోలూ, వీడియోల వంటివెన్నో తమ స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. అయితే ఉన్న ఫళాన మీ Facebook అకౌంట్ పనిచేయకుండా పోయింది అనుకోండి.. ఎన్నో ఏళ్లుగా మీరు Facebook ద్వారా షేర్ చేసుకున్న సమాచారం మీద ఆశలు వదిలేసుకోవలసిందేనా? ఎంతమాత్రమూ కాదు. మన Facebook అకౌంట్ లోని మొత్తం సమాచారాన్ని మన పిసిలోకి బ్యాకప్ తీసుకోవడం ఎలాగో ఈ వీడియోలో “ కంప్యూటర్ ఎరా ” తెలుగు మాసపత్రిక ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ వివరిస్తున్నారు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే సులభంగా అర్థమవుతుంది.