మీ దగ్గర ఒకటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉందనుకుందాం. దాన్ని Wireless ద్వారా లేదా Wireతోనూ ఒకటి కంటే ఎక్కువ కంప్యూటర్లకూ, లాప్ టాప్ లకూ, Wi-Fi సదుపాయం ఉన్న సెల్ ఫోన్లకూ పంచుకోవాలనుకున్నారనుకుందాం. సో మొట్టమొదట చేసే పనేమిటి? మార్కెట్లోకి వెళ్లి Netgear వంటి వైర్ లెస్ రూటర్ ని కొనుక్కొచ్చుకుని దాని ద్వారా నెట్ షేరింగ్ ని కాన్ఫిగర్ చేసుకోవడం! చాలామంది అంతటితో వదిలేస్తుంటారు. ఒక రూటర్ లో అంతర్గతంగా ఎన్నో సెట్టింగులు చేసుకోవచ్చు. ఎలాంటి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్లు అవసరం లేకుండా అవసరం లేని వెబ్ సైట్లని బ్లాక్ చేసుకోవచ్చు, మన నెట్ వర్క్ లో ఉన్న ఏదైనా కంప్యూటర్ కి నెట్ కనెక్షన్ అందకుండా అడ్డుకోవచ్చు.. అసలు ఈ సెట్టింగులు అన్నీ ఎక్కడ ఉంటాయి.. ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలన్నది ఈ క్రింది వీడియోలో నా రూటర్ ని మీకూ చూపిస్తూ నా రూటర్ కాన్ఫిగరేషన్ సెట్టింగులను కూడా మీకు చూపిస్తూ వివరంగా డిమాన్ స్ట్రేట్ చేశాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine