Windows Vista, ఆ తర్వాత Windows 7 ఆపరేటింగ్ సిస్టమ్ లు వాడుకలోకి వచ్చినా.. ముఖ్యంగా Windows 7 అత్యద్భుతంగా ఉన్నా ఇప్పటికీ చాలామంది పిసి యూజర్లు వివిధ కారణాల వల్ల, కొందరైతే అవగాహనారాహిత్యం వల్ల Windows XPనే వాడుతున్నారు. Windows XPలో తెలుగు, తమిళ్.. వంటి భాషలకు చెందిన యూనీకోడ్ వెబ్ సైట్లని ఓపెన్ చేసినప్పుడు బాక్సులుగా, ??? (క్వశ్చన్ మార్కులుగా) కన్పిస్తున్నాయని చాలామంది కంప్లయింట్ చేస్తుంటారు. చాలా సింపుల్ గా 5 నిముషాల లోపే ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో కంప్యూటర్ ఎరా తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ వివరిస్తున్నారు. వాస్తవానికి 2007 నుండి ఇప్పటివరకూ (2010 డిసెంబర్) వేలాది మంది కంప్యూటర్ ఎరా తెలుగు ప్రింటెడ్ మేగజైన్ పాఠకులకు, ఇతరులకు ఈ విషయమై అవేర్ నెస్ ని తీసుకువచ్చాను.