తెలుగు telugu windows booting ఎందుకంత సమయం

2010-12-12 48

ఇంటెల్ Core2Duoలు పాతబడిపోయి i3, i5, i7 ప్రాసెసర్ల శ్రేణిలోకి మనం ప్రవేశించినా ఇప్పటికీ విండోస్ బూటింగ్ పూర్తయి డెస్క్ టాప్ పూర్తిగా రావడానికి దాదాపు ఒక నిముషం టైమ్ పడుతూనే ఉంటోంది. నాకు నేను నా Intel Core i5 750 (2.67 GHz) ప్రాసెసర్ లో Windows 7 తక్కువలో తక్కువ తీసుకున్న సమయం 32 సెకండ్లు. సరే అసలు విషయానికి వస్తే మనకు చాలాసార్లు కంప్యూటర్ ని ఆన్ చేసి డెస్క్ టాప్ వచ్చేవరకూ వెయిట్ చేసే టైమ్ లో అన్పిస్తూ ఉంటుంది.. "వెనుక ఏం లోడ్ అవుతోంది.. ఇంత టైమ్ పడుతోందీ" అని! అందుకే మనకు డెస్క్ టాప్ రావడానికి అంతంత టైమ్ ఎందుకు పడుతోందీ, ఏ అప్లికేషన్, ఏ ప్రాసెస్ ఎంత టైమ్ తీసుకుంటోందీ తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో కంప్యూటర్ ఎరా మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ వివరిస్తున్నారు.