AP Budget 2025 : వార్షిక బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత మేర పద్దు కేటాయింపులున్నాయి, పది నెలల్లో చేసిన ఖర్చు ఎంత? ఆర్థిక ఏడాది మొత్తం మీద ఎంత ఖర్చు చేయగలరు? అనే అంశాలపై మేథోమథనం సాగుతోంది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాఖల వారీగా మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.