Divis Pharma Company Works Under Police Security: కాకినాడ జిల్లా తొండగి మండలం ఒంటిమామిడి వద్ద దివిస్ ఫార్మా పరిశ్రమ మూడో యూనిట్ నిర్మాణంలో సముద్రంలోకి పైపులైన్లు వేసే ప్రక్రియ భారీ పోలీస్ బందోబస్త్ మధ్య చేపట్టారు. సముద్ర జలాలు వినియోగించుకునేందుకు సముద్రంలోకి కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసే ప్రక్రియ ఇవాళ చేపట్టారు. దివిస్ ఫార్మా 200 ఎకరాల్లో 15 కోట్ల పెట్టుబడితో తొలి యూనిట్ పూర్తి చేసింది. తొండంగి సముద్ర తీరంలో ఫార్మా పరిశ్రమ ఏర్పాటును మొదటి నుంచి స్థానిక మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు.