ఎన్నో ఐటీ దాడులు జరుగుతున్నా, మీడియా మొత్తం నాపైనే ఫోకస్‌ చేసింది : దిల్​రాజు

2025-01-25 1

Dil Raju Explains About IT Raids : నాలుగు రోజుల నుంచి ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఐటీ దాడులు జరిగాయని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తెలిపారు. ఎన్నో ఐటీ దాడులు జరుగుతున్నా, మీడియా తనపైనే ఎక్కువ ఫోకస్‌ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల నుంచి ఎంత ఫోకస్‌ చేస్తున్నారో చూస్తూనే ఉన్నామన్నారు. అందుకే ఆ నాలుగు రోజులు ఏం జరిగిందో చెప్పాలని మీడియాను పిలిచానని వివరించారు. ఐటీ దాడులకు సంబంధించి హైదరాబాద్‌లోని తన నివాసంలో దిల్‌ రాజు మీడియా సమావేశం నిర్వహించారు.

తెలిసింది, తెలియనివి ఏవేవో వార్తలు వేస్తూ హైలెట్స్‌ చేస్తున్నారని నిర్మాత దిల్‌ రాజు ధ్వజమెత్తారు. ఐటీ తనిఖీలు తమ సంస్థలో 2008లో ఒకసారి జరగ్గా, మళ్లీ దాదాపు 16 ఏళ్ల తర్వాత జరిగాయని వివరణ ఇచ్చారు. ఆ మధ్యలో మూడుసార్లు అకౌంట్స్‌ బుక్స్‌కు సంబంధించిన సర్వే చేశారని తెలిపారు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ తనిఖీలు అనేవి నిరంతరం జరిగే ప్రక్రియ అని వివరించారు. తమతో పాటు ఇతర నిర్మాణ సంస్థలు, ఫైనాన్సర్స్‌పై కూడా ఐటీ దాడులు జరిగాయని చెప్పారు.