'ఆమెతో కలిసి ఉండేందుకే' - మీర్‌పేట హత్య కేసులో సంచలన విషయాలు - MEERPET MURDER CASE UPDATE

2025-01-24 7

Meerpet Murder Case Update : తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట చిల్లెలగూడలో జరిగిన దారుణ హత్య ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఓ మహిళతో ఉన్న సంబంధం ఈ హత్యకు దారి తీసినట్లు విచారణలో భాగంగా గురుమూర్తి నుంచి పోలీసులు వివరాలు రాబట్టారు. పథకం ప్రకారం హత్య చేసిన గురుమూర్తి, ఓ వెబ్‌ సిరీస్‌ తరహాలో మృతదేహాన్ని మాయం చేసి తప్పించుకోవాలనుకున్నట్లు సమాచారం.

మరోవైపు నిందితుడు హత్య చేసినట్లు చెప్పినా, దానికి సంబంధించి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అతడు చెప్పిన విషయాలపై ఆధారపడకుండా వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుడి ఫోన్‌ పరిశీలించినప్పుడు మరో మహిళ ఫొటోలు కొన్ని ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 18వ తేదీన నమోదు చేసిన వెంకట మాధవి అదృశ్యం కేసును హత్య కేసు సెక్షన్ల కింద మారుస్తున్నారు. కేసు విషయంలో నేడు కొంత స్పష్టత వచ్చే అవకాశముంది.