దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో సీఎం చంద్రబాబు ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో రెండో రోజూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే సీఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్‌పై నిర్వహించిన సదస్సులో చంద్రబాబు మాట్లాడారు.