NTR Vardhanthi 2025 : టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. ఆయన మరణించి నేటికి 29 ఏళ్లు గడిచిన సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ ఘాట్‌కు చేరుకుని అంజలి ఘటించారు. నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ కొనియాడారు.