High Tension At Telangana Bjp Office : హైదరాబాద్లోని నాంపల్లిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంక గాంధీపై దిల్లీకి చెందిన బీజేపీ నేత రమేశ్ బిదూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టించేందుకు చేసిన యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.