AP DY CM Pawan Kalyan Reaction On Allu Arjun Arrest : ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి జరిగిన విషయం విధితమే. ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నటువంటి ఆయన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించి దాడి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధ్యులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఆయన స్పందించారు. సమస్యలు చాలా ఉన్నాయని, సినిమా అనేది చిన్న సమస్యని పవన్ అన్నారు. బాధితుడి పరామర్శకు వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడడం సరికాదని హితవు పలికారు.