కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం

2024-12-24 2

Construction of Indiramma houses : వచ్చే కొత్త సంవత్సరం(2025)లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల సర్వే పూర్తయినట్లు తెలిపారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్​సైట్, టోల్ ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకొస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.