రాయలసీమ పారిశ్రామిక హబ్‌గా మారనుంది. కర్నూలు సిగలో మరో కలికితురాయి చేరనుంది. దేశానికే తలమానికమైన సెమీకండక్టర్ పరిశ్రమ ఓర్వకల్లు పారిశ్రామికహబ్‌లో ఏర్పాటు కానుంది. వేల కోట్ల పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనుండటంతో జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.