TPCC Chalo Rajbhavan in Hyderabad : అదానీపై మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ తన వైఖరి ఏమిటో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అదాని అవినీతి అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి బీజేపీ చర్యలు తీసుకోకపోవడానికి నిరసనగా దేశ వ్యాప్తంగా ఏఐసీసీ చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చింది.