ఇక్కడ అనేక సహజ వనరులు ఉన్నాయి

2024-12-13 2

MLA Yeluri Sambasiva Rao Letter To Central Minister : బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం మోటుపల్లి-పెద్దగంజాం మధ్య సముద్రతీర ప్రాంతంలో ఓడల తయారీ పరిశ్రమ, గ్రీన్‌ఫీల్డు పోర్టు నిర్మించాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్ర ఓడరేవులు, షిప్పంగ్‌ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌కు లేఖ రాశారు. ఆ లేఖను గురువారం దిల్లీలో మారిటైంబోర్డు ఛైర్మన్‌ దామచర్ల సత్య కేంద్ర మంత్రికి అందజేశారు. ఆ రెండు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం రాష్ట్రానికి, దేశానికి తలమానికంగా నిలుస్తుంది. దీంతో పాటు ప్రాచీన చరిత్రకు జీవం పోసి ఎంతో ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని ఎమ్మెల్యే తన లేఖలో పేర్కొన్నారు.