Allu Arjun Arrest : ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 4న పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేశారు. తొలుత అల్లు అర్జున్ ఇంటి వద్ద చేరుకున్న పోలీసులు, ఆయనను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరిలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అల్లుఅర్జున్ను పోలీసులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అల్లు అర్జున్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల తీరును తప్పుపట్టారు. తనను అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదన్నారు.