Competition For MLC Posts in TDP : రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికల వేడి చల్లారడంతో ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వైఎస్సార్సీపీలో ఇమడలేమంటూ ఇప్పటికే నలుగురు శాసనమండలి సభ్యులు రాజీనామా చేశారు. మరో 8 మంది అసంతృప్తులు ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి తోడు మార్చిలో మరో 5 ఖాళీలు ఏర్పడనుండగా మొత్తంగా 15 వరకు భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పదవుల భర్తీపై కొందరు ముఖ్య నేతలను పిలిచి చర్చిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.