Collectors Conference in Amaravati : అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ముగిసింది. విధ్వంసం జరిగాక దాన్ని పునరుద్ధరించేందుకు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. ప్రతీ సంక్షోభంలోనూ అవకాశాలుంటాయని, వాటిని వెతుక్కోవడమే నాయకత్వం అవుతుందని చెప్పారు. సాధారణంగా ఈ తరహా సదస్సుల్లో విజన్ గురించి ప్రస్తావించి దాన్ని సాధించేందుకు లక్ష్యాలను నిర్దేశించాలన్నారు.