పుష్ప-2 సక్సెస్ మీట్​ - 'ఇన్ని రికార్డులకు కారణమైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్​కు ప్రత్యేక కృతజ్ఞతలు'

2024-12-07 16

టికెట్​ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చి, ఇన్ని రికార్డులు సాధించడానికి కారణమైన ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్​కు హీరో అల్లు అర్జున్​ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ.. సీఎంలు రేవంత్​ రెడ్డి, చంద్రబాబులకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రాంతీయ సినీ పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగి దేశంలో ఉన్నతస్థాయిలో ఉందని పేర్కొన్నారు. తొలిరోజు వచ్చిన నెంబర్లు తన సినిమాపై ఎంత మంది చూశారనడానికి నిదర్శనమన్నారు.