Fire Accident at Malakpet Metro Station : హైదరాబాద్‌లోని మలక్‌పేట మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ వద్ద వాహనాలకు మంటలు అంటుకున్నాయి. వాహనాలకు మంటలు అంటుకుని పొగ భారీగా వ్యాపించింది. దట్టంగా అలముకున్న పొగతో మెట్రో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మలక్‌పేట మెట్రో స్టేషన్ వద్ద పార్కు చేసిన 5 బైకులు దగ్ధమయ్యాయి. మలక్‌పేట మెట్రో పిల్లర్ నెంబర్ 1409 వద్ద ఈ అగ్ని ప్రమాదం జరిగింది. బైకులు తగలబడుతుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అగ్ని ప్రమాదంతో మలక్‌పేట-దిల్సుఖ్నగర్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అలాగే చాదర్‌ఘాట్ నుంచి మలక్‌పేటకు వెళ్లే వాహనదారులు ట్రాఫిక్‌తో ఇబ్బంది పడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలకు గల కారణాలను పరిశీలిస్తున్నారు.