ఆ ఒప్పందాలను రద్దు చేయాలి: సీపీఐ నేత నారాయణ

2024-11-24 1

CPI NARAYANA ON YS JAGAN ADANI BRIBERY CASE: అదానీ ముడుపుల వ్యవహారం రాష్ట్రంలో, దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. కార్పొరేట్ దిగ్గజం అదానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ మోదీకి అనుకూలంగా ఉన్నారన్నారు. అదానీపై అమెరికాలో నమోదైన కేసు వ్యవహారంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోకూడదన్నారు.