Father Murder his Son in Alluri Sitarama raju District : మద్యం మత్తులో నిత్యం వేధిస్తున్న కుమారుడిని తండ్రి హత్య చేసిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని జీకేవీధి మండలం ఏనుగుబైలులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గూడెంకొత్తవీధి సీఐ వర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన కొర్రా సన్యాసిరావు(40) భార్య దలిమొతి, తండ్రి చిత్రో, తల్లి లచ్చితో కలిసి నివాసం ఉంటున్నాడు. సన్యాసిరావు నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను, తల్లిదండ్రులు కొడుతుండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 14న పొలంలో పని చేస్తున్న మామ చిత్రోకు దలిమొతి భోజనం తీసుకెళ్లింది. సన్యాసిరావు పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తన తండ్రికి భోజనం తీసుకెళ్లినందుకు భార్యను కొట్టాడు.