మెదక్​లో అర్థరాత్రి మొసలి కలకలం - సోషల్​ మీడియాలో వైరల్​

2024-11-22 1

Crocodile in Medak District : మొసళ్లను మనం సహజంగా జూపార్కులు, సరస్సులు, నదుల్లో మాత్రమే చూస్తుంటాం. అప్పుడప్పుడు భారీ వరదలు సంభవించిన సమయాల్లోనూ బయటపడుతుంటాయి. అలాంటి మొసలి నడి రోడ్డుపై పాకుతు కనిపిస్తే ఎవ్వరైనా జంకాల్సిందే. మెదక్​ జిల్లాలో అచ్చం ఇలాంటి ఘటనే ప్రయాణికులకు ఎదురైంది.

మెదక్ పట్టణంలోని పసుపులేరు వాగు సమీపంలో మెదక్ -హైదారాబాద్ ప్రధాన రహదారిపై అర్థరాత్రి మొసలి ప్రత్యక్షమై కలకలం సృష్టించింది. అక్కడున్న ప్రయాణికులు ఆ మొసలిని చూసి భయభ్రాంతులకు గురైయ్యారు. ఆ రోడ్డు మార్గం గుండా వెళుతున్న ప్రయాణికులు మొసలిని తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియో కాస్త సోషల్ పోస్ట్ చేయగా మీడియాలో వైరల్ అయ్యింది.

Videos similaires