అతనో పోలీస్ అధికారి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసుల పై చిందులు తొక్కాడు. నానా రభస చేసి పోలీసు శాఖ పరువుని బజారుపాలు చేశాడు. అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్ వైపునకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్తో సహా మరో ముగ్గురు మంగళవారం రాత్రి సఫారీ కారులో వెళ్లారు. అక్కడ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు జరుగుతుండటాన్ని గమనించారు.తాగి కారు డ్రైవింగ్ చేసిన కారు డ్రైవర్ కారును ఆపి తన సీటు నుంచి దిగి వెనకాల సీటులోకి వెనుకున్న వ్యక్తి డ్రైవింగ్ సీట్లోకి మారాడు.