CM Revanth Comments On E Racing Scam : గవర్నర్ అనుమతి రాగానే ఈ-రేస్ స్కామ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా గవర్నర్ అనుమతి నుంచి తప్పించుకునేందుకు దిల్లీలో లాబీయింగ్ కోసం కేటీఆర్ దిల్లీ వచ్చారన్నారు. ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు.