కలెక్టర్​పై రాళ్లు, కర్రలతో దాడి - పోలీసుల అదుపులో 55 మంది

2024-11-12 2

Farmers Attack On Officials In Vikarabad : ఔషధ (ఫార్మా) పరిశ్రమల ఏర్పాటుకు భూ సేకరణ నిమిత్తం వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామసభ రణరంగాన్ని తలపించింది. గ్రామసభ నిర్వహించేందుకు వచ్చిన అధికారులపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడిన 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దుద్యాల, కొడంగల్‌, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా లగచర్లలో భారీగా పోలీసులు మోహరించారు.