రమాదేవి పబ్లిక్​ స్కూల్​లో టెక్​ ఫెస్ట్​ -2024

2024-11-09 1

Ramadevi Public School Tech Fest-2024 : హైదరాబాద్​లోని రమాదేవి పబ్లిక్​ స్కూల్​ నిర్వహించిన టెక్​ ఫెస్ట్​ను ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు మనవడు పూర్ణ సుజయ్ ప్రారంభించారు. పాఠశాల ట్రస్టీ రావి చంద్రశేఖర్, ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా సహా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రోబోటిక్స్, కంప్యూటర్ సైన్స్, బయాలజీ వంటి విభాగాల్లో సరికొత్త ఆవిష్కరణలను విద్యార్థులు కళ్లకు కట్టారు.

టెక్‌ ఫెస్ట్‌లో పిల్లలు చూపిన ప్రతిభ ఎంతగానో ఆకట్టుకుందని పూర్ణ సుజయ్‌ అన్నారు. రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి ఇకపై రామోజీరావు పేరిట అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రతి రంగంలో రామోజీరావు పాటించిన విలువలతో ఆయన ఎప్పుడూ మన మధ్యే ఉంటారని పేర్కొన్నారు. విద్య, క్రీడలు సహా మిగతా అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు రామోజీరావు ట్రోఫీ అందిస్తామని చెప్పారు. విద్యార్థులంతా తయారు చేసిన అన్ని ప్రాజెక్టులను స్వయంగా పూర్ణ సుజయ్ పరిశీలించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారులను అభినందించారు.