Rains In Hyderabad : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురిసాయి. భాగ్యనగరంతో పాటు నగర శివార్లలోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కొండాపూర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లిలో వర్షం దంచికొట్టింది. సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమై హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, కేపీహెచ్‌బీకాలనీ ప్రాంతాల్లో జల్లులు కురిపించింది.
మరోవైపు మూసాపేట్, నిజాంపేట్, ప్రగతినగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండి మైసమ్మ, మల్లంపేట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.