Adani Group Delegation Met Chandrababu : రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే భారీ పెట్టుబడుల ప్రతిపాదనలతో అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, గనులు, పోర్టులు, డేటా సెంటర్‌లు, కృత్రిమ మేధ, ఐటీ, పర్యాటకం వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. స్వర్ణాంధ్ర సాధన, రాజధాని నిర్మాణంలో ఏపీ సర్కార్‌తో కలసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది.