వింటేజ్​ కార్ల ఎగ్జిబిషన్ - మీరు ఇప్పటివరకు చూడని కార్లన్నీ ఇక్కడ చూసేయొచ్చు - ఎంట్రీ కూడా ఫ్రీ

2024-10-28 2

Vitage Cars Show in Secunderabad : కాలం ముందుకు వెళుతున్న కొద్దీ పాత వాటికి విలువ పెరుగుతూ ఉంటుంది. అది వస్తువులైనా, మనుషుల మధ్య బంధాలైనా. మరీ ముఖ్యంగా ఇప్పట్లో అందుబాటులో లేని వాటికైతే ఆ విలువ అమూల్యం. వందల కిలోమీటర్లు అయినా కాలినడకనే ప్రయాణం సాగించిన కాలంలో వాడిన కార్లు, జీపులు నేటి తరం వాళ్లకి ఎంతో గొప్పగా అనిపిస్తాయి. అలాంటి వింటేజ్ కార్లతో కాఫీ అండ్ కార్స్ అనే సంస్థ సికింద్రాబాద్​లో ప్రదర్శన ఏర్పాటు చేశారు. శతాబ్దం కిందటి కాలం నాటి ఈ వాహనాలను చూసేందుకు సందర్శకులు భారీగా వస్తున్నారు.