YS Sharmila Responds On Subba Reddy Comments : జగన్‌కు లాభం అనుకుంటే ఎవరినైనా వాడుకుంటారని, లేదని అనుకుంటే అణిచివేస్తారని వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి సుబ్బారెడ్డి అని వ్యాఖ్యానించారు. సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు ఆర్థికంగా లాభపడ్డారని, రేపు సాయిరెడ్డి కూడా సుబ్బారెడ్డి లాగే మాట్లాడతారని చెప్పారు. అందరికీ సమాన వాటా ఉండాలని వైఎస్ అనుకున్నారని తన బిడ్డలపై ప్రమాణం చేస్తానన్నారు. సుబ్బారెడ్డి చెప్పిన విషయాలన్నీ నిజమని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు