వాట్సప్​లో వంద రకాల సేవలు

2024-10-24 2

State Govt Partnership with Meta for Digital Public Services : ప్రభుత్వ సేవలను ప్రజలకు మరితం సులభతరం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. నవంబర్‌ 30 నుంచి వంద రకాల సేవలను ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి తెచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. రేషన్‌ కార్డుల జారీ, రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుకింగ్‌, పంటల మార్కెట్‌ ధరలు, దైవ దర్శనాలు, విద్యార్థుల హాజరు, ఇలా ఎన్నో రకాల సేవలను వాట్సప్‌ బిజినెస్‌ సర్వీస్‌ వేదిక ద్వారా ఇట్టే పొందే వెసులుబాటు తీసుకొస్తోంది.