ప్రభాస్ ఇంటి వద్ద అభిమానుల ఆందోళన

2024-10-23 1

Prabhas Birthday 2024 : నార్మల్​గానే ప్రభాస్​ అభిమానులను సైలెంట్​గా ఉంచడం కష్టం. అదీ యంగ్​ రెబల్​ స్టార్​ బర్త్​ డే రోజున ఇంకా కష్టం. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా వారం ముందు నుంచే సోషల్​ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఎక్కడ చూసిన పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ గురించే ట్రెండింగ్. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్​ బర్త్​డే(అక్టోబరు 23) రానే వచ్చింది.

ప్రభాస్​కు విషెస్​ చెప్పడానికి ఆయన అభిమానులు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత భారీగా డార్లింగ్​ ఇంటి వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా కలవాలని ప్రయత్నించారు. అర్ధరాత్రి ప్రభాస్​ ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోగా, ఆగ్రహించిన ఫ్యాన్స్​ ప్రభాస్​ను కలవాలంటూ రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో చేసేదేమీ లేక ఆందోళనకు దిగిన వారందరినీ అక్కడ నుంచి చెదరగొట్టారు.