BJP and BRS Followers Agitation At Ambedkar Statue in Telangana : హైదరాబాద్‌లో గ్రూప్ -1 అభ్యర్థుల పోరాటం ఇవాళ కూడా కొనసాగుతోంది. పరీక్ష యధాతథంగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినా మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ మరోసారి ఆందోళనకు దిగారు. పరీక్షలు రద్దు చేయాలంటూ ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. తెలుగుతల్లి ప్లై ఓవర్ వద్ద వీరికి బీఆర్ఎస్, బీజేపీ నేతలు మద్దతు పలికారు. అయితే ఈ సమయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ముందుగా సచివాలయానికి ర్యాలీగా వెళ్తున్న గ్రూప్ వన్ అభ్యర్థులకు మద్దతుగా వచ్చిన బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, ప్రవీణ్‌కుమార్‌లను గ్రూప్-1 అభ్యర్థులు అడ్డుకున్నారు. గులాబీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.