Free Fish Seeds Distribution In TG : రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ ప్రక్రియ ఆరంభం కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అట్టహాసంగా ప్రారంభంకానుంది. పండగ వాతావరణంనడుమ మత్స్యకారులు ప్రత్యేక పూజలు చేస్తూ చెరువుల్లోకి చేపపిల్లలు వదలనున్నారు. మత్స్యకార కుటుంబాల్లో సిరులు కురవడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నంప్రభాకర్ తెలిపారు.